Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులు అమ్ముకున్నా: నరేశ్

Naresh sensational comments on selling assets after entering politics
Advertisement
  • పార్టీ కార్యక్రమాల కోసం సొంత ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందన్న నరేశ్
  • హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్లానని వెల్లడి
  • సుమారు 15 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానన్న నరేశ్ 
Advertisement
సీనియర్ నటుడు నరేశ్ తన రాజకీయ జీవితం గురించి, దానివల్ల ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని, ఆ నష్టాలను పూడ్చుకోవడానికి సొంత ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

హీరోగా మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టానని నరేశ్ చెప్పారు. డబ్బు సంపాదన తన లక్ష్యం కాదని, పార్టీ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల కోసం పెద్ద మొత్తంలో సొంత డబ్బు ఖర్చు చేశానని చెప్పారు. అదనపు ఆదాయం కోసం ప్రారంభించిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వంటి వ్యాపారాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని వివరించారు.

తన ఉదార స్వభావం కూడా ఆర్థిక ఇబ్బందులకు ఒక కారణమని నరేశ్ అంగీకరించారు. 1998లో రాజకీయాల్లో పూర్తిగా చురుకుగా మారిన తర్వాత దాదాపు 12 నుంచి 15 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. చిన్నప్పటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినయ్యానని, హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సంపాదించిన డబ్బును భూముల వంటి స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నరేశ్ అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement
Naresh
Actor Naresh politics
Naresh financial loss
Hindupur MP Naresh
BJP Naresh
Naresh properties sold

More Telugu News